US presidential Election: జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు

by Shamantha N |
US presidential Election: జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని వారాలుగా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) తనకు పలుమార్లు ఫోన్ చేశారని వెల్లడించారు. తనపై జరిగిన కాల్పుల తర్వాత వైరల్ గా మారిన ఫొటోను సెన్సాహ్ చేసినందుకు క్షమాపణలు చెప్పారని తెలిపారు. "ఇది నిజంగా అద్భుతమైనది, చాలా ధైర్యంగా ఉంది” అని మస్క్ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. వారు తప్పు చేశారని జుకర్ బర్గ్ చెప్పాడని అన్నారు. ఆ తప్పుని సరిదిద్దుతా అని పేర్కొన్నారు కానీ.. గూగుల్ నుంచి ఎవరూ కాల్ చేయలేదని ట్రంప్ తెలిపారు. జుకర్‌బర్గ్ ఆ రోజు తనని గౌరవించారని పేర్కొన్నారు. ఆయన డెమొక్రాట్లకు మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇకపోతే, జులైలో ఏ పార్టీ అభ్యర్థికి తాను మద్దతు తెలపట్లేదన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పాల్గొనదలుచుకోలేదన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ట్రంప్ ని ఆమోదిస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story