Space Station :2035కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం

by Hajipasha |
Space Station :2035కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో : 2035 నాటికి భారత్(India) సొంత అంతరిక్ష కేంద్రాన్ని(Space Station) కలిగి ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. దానికి ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. శనివారం రోజు ఇస్రో, కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జితేంద్ర సింగ్ మాట్లాడారు.

బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీలపై కలిసికట్టుగా పరిశోధనలు చేసేందుకు ఇస్రో, డీబీటీలు చేతులు కలపడాన్ని కీలక పరిణామంగా ఆయన అభివర్ణించారు. ‘బయోఈ3’ పాలసీలో భాగంగా ఆర్థిక వికాసం, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగాల కల్పన కోసం బయోటెక్నాలజీని వాడుకుంటామన్నారు. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగంలో దాదాపు 300కుపైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed