సర్ ప్లస్ టీచర్లు ఇతర స్కూళ్లకు.. విద్యాశాఖ ఉత్తర్వులు

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-26 17:15:25.0  )
సర్ ప్లస్ టీచర్లు ఇతర స్కూళ్లకు.. విద్యాశాఖ ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్ ప్లస్ ఉన్న ఉపాధ్యాయులను టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు షిష్ట్ చేస్తోంది. అందులో భాగంగా దాదాపు 860 మందికి పైగా టీచర్లను ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసంది. రాష్ట్రంలో పలు ప్రైమరీ పాఠశాలలు(Primary Schools) అప్పర్ ప్రైమరీ(Upper Primary)కి అప్ గ్రేడ్ అయ్యాయి. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూళ్లుUpper Primary Schools) హైస్కూళ్లు(High schools)గా అప్ గ్రేడ్ అయ్యాయి. అలాగే కొన్నిచోట్లు కొత్త ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను షిష్ట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వారీగా డేటాను పంపించాలని ఈనెల 15న విద్యాశాఖ డీఈవోలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ జాబితా ఆధారంగానే టీచర్ల కొరత ఉన్న చోటకు సర్ ప్లస్ ఉన్న టీచర్లను షిఫ్ట్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టంచేశారు.

Advertisement

Next Story