పెండింగ్‌లో 91 వర్క్స్..మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-10-26 17:10:47.0  )
పెండింగ్‌లో 91 వర్క్స్..మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం కొరకు అటవీ అనుమతులు ఆగిపోతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అటవీ అనుమతులు లేక దాదాపు 91 చోట్ల వర్క్స్ నిలిచిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఆలస్యంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రి కోమటిరెడ్డి, మంత్రి కొండా సురేఖకు రిక్వెస్ట్ చేశారు. ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు రోడ్లే కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు. ఐదేళ్లుగా31 ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనమన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ...అటవీ అనుమతులను వేగంగా సాధించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షలో ఆర్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ (డిజాస్టర్ మెనేజ్ మెంట్) హరీష్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ఈఎన్సీ, సీఈ లతో పాటు మోర్త్ ఆర్ఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story