- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gujarat : పాక్ గూఢచారికి భారత నౌకాదళ సమాచారం.. ఒకరి అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : భారత నౌకాదళానికి(Navy) చెందిన నౌకల సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ కోసం పనిచేస్తున్న మహిళకు అందజేస్తున్న పంకజ్ కోటియా అనే వ్యక్తిని గుజరాత్(Gujarat) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. అతడు పోర్‌బందర్‌లోని పొగాకు కర్మాగారంలో కూలీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న మహిళ.. ‘రియా’ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో అకౌంటు క్రియేట్ చేసుకుంది. తాను భారత నేవీ కోసం పనిచేస్తున్నట్లుగా ప్రొఫైల్ వివరాల్లో రాసుకుంది.
ఫేస్‌బుక్‌లో తనకు పరిచయమైన పంకజ్ కోటియా ద్వారా భారత్‌లోని నౌకాదళ స్థావరాలు, వాటి లొకేషన్స్, నౌకల మోహరింపు వంటి సమాచారాన్ని పాక్ గూఢచారి సేకరించింది. ఈ వివరాలను పంపడానికి తన వాట్సాప్ నంబరును పంకజ్‌కు ఇచ్చింది. ఏటీఎస్ పోలీసులు ఈ వాట్సాప్ నంబరును ట్రేస్ చేయగా.. పాకిస్తాన్(Pakistan)లో లొకేషన్ ఉన్నట్లు తేలింది. పంకజ్ నుంచి నౌకాదళ సమాచారాన్ని రాబట్టే క్రమంలో సదరు పాక్ గూఢచారి దాదాపు రూ.26వేలను యూపీఐ ద్వారా పలు విడతల్లో పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.