‘పాలస్తీనా’ ర్యాలీలో.. ‘జై శ్రీరాం’ నినాదాలు

by Hajipasha |   ( Updated:2024-04-29 12:26:46.0  )
‘పాలస్తీనా’ ర్యాలీలో.. ‘జై శ్రీరాం’ నినాదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని పలు యూనివర్సిటీ క్యాంపస్‌లు ఇప్పుడు పాలస్తీనా అనుకూల నిరసనలతో హోరెత్తుతున్నాయి. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపించాలని అమెరికా ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయినా నిరసనలు ఏమాత్రం ఆగడం లేదు.

తాజాగా లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనా అనుకూల నిరసన కార్యక్రమం జరుగుతుండగా.. ఓ ఇజ్రాయెలీ యూదు విద్యార్థి అక్కడికి చేరుకున్నాడు. తమ దేశ జాతీయ జెండాను చేతిలో పట్టుకొని ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలస్తీనా అంశంపై నిరసన జరుగుతుంటే.. జైశ్రీరామ్ నినాదాన్ని సదరు యూదు విద్యార్థి ఎందుకు ఉపయోగించాడనేది ఇంకా తెలియరాలేదు. పాలస్తీనా అనుకూల ర్యాలీల్లో ఎంతోమంది భారతీయ విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమన కాండ ఆగాలని వారు గళమెత్తి డిమాండ్ చేస్తున్నారు.

Click here for Twitter Video

Advertisement

Next Story

Most Viewed