- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం.. ట్రంప్ ప్రశంసలు

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతి నేత కాష్ పటేల్ (Kash Patel) బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు శనివారం వాషింగ్టన్‌లోని (White House campus) వైట్ హౌస్ క్యాంపస్‌లో గల ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లోని ఇండియన్ ట్రీటీ రూమ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. అటార్నీ జనరల్ పామ్ బోండీ కాష్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ (Bhagavad Gita) భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో కాష్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్‌కిన్స్ భగవద్గీతను పట్టుకోగా దానిపై చేయి ఉంచి ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత, ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉటుందని హామీ ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయనపై ప్రశంసలు కురిపించారు. కాష్ పటేల్‌కు తన మద్దతు ఎప్పటికి ఉంటుందని వెల్లడించారు.
కాష్ బాధ్యతలు తీసుకోగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం లో వెయ్యి మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఫీల్డ్ ఆఫీస్‌లకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. మరో 500 మందిని హంట్స్ విల్లే, అలబామాలోని సెంటర్‌కు బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారత సంతతి నేత కాష్ పటేల్‌ను నిన్న 51-49 ఓట్లతో యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.