ఇటలీ కాప్రీ ద్వీపంలో తీరిన నీటి కొరత.. పర్యాటకులపై నిషేధం ఎత్తివేత

by Harish |
ఇటలీ కాప్రీ ద్వీపంలో తీరిన నీటి కొరత.. పర్యాటకులపై నిషేధం ఎత్తివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీలోని కాప్రీ ద్వీపంలో నీటి కొరతతో ఇటీవల పర్యాటకులపై నిషేధం విధించగా, తాజాగా దానిని ఎత్తివేశారు. కాప్రీ మేయర్, పాలో ఫాల్కో మాట్లాడుతూ, ప్రధాన ప్రాంతం నుంచి నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న సాంకేతిక సమస్య పరిష్కరించబడిన తర్వాత నీటి విడుదల ప్రస్తుతం మామూలు స్థితికి వచ్చింది. అందుకే నిషేధాన్ని ఎత్తి వేసినట్లు తెలిపారు. అంతకుముందు నీటి సరఫరా తగ్గిపోవడం వలన శనివారం తెల్లవారుజామున ఆంక్షలు విధించడంతో దక్షిణ ఇటలీలోని నేపుల్స్, సోరెంటో నుండి ద్వీపానికి వెళ్లే అనేక పడవలు తిరిగి ఓడరేవుకు వెళ్లాయి.

శుక్రవారం వరకు ద్వీపంలో చాలా నీరు ఉండగా, శనివారం ఉదయం నాటికి తగ్గుముఖం పట్టడంతో ఈ నిషేధం విధించారు. కాప్రీకి రోజూ వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. నీరు తక్కువగా ఉన్న సమయంలో వారి రాకతో అత్యవసర పరిస్థితి మరింత దిగజారుతుంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కాప్రీ మేయర్, పాలో ఫాల్కో ఇంతకుముందు తెలిపారు. నిషేధానికి గురికాని స్థానికులకు ట్యాంకర్ ద్వారా ఇంటికి 25 లీటర్లు (6.6 గ్యాలన్లు) వరకు తాగునీటిని పంపిణీ చేశారు. కాప్రీ ద్వీపంలో దాదాపు 13,000 మంది శాశ్వత నివాసులు ఉన్నారు. ఇది తెల్లటి విల్లాలు, కోవ్-స్టడెడ్ తీరప్రాంతం, ఉన్నత స్థాయి హోటళ్లకు ప్రసిద్ధి చెందింది.

Advertisement

Next Story

Most Viewed