Ram Charan: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-11-03 14:15:14.0  )
Ram Charan: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: గత మూడేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’(game changer). ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తుండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations), జీ స్టూడియోస్, దిల్‌రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, గేమ్ చేంజర్’(game changer) మూవీ మేకర్స్ దీపావళి(Diwali) కానుకగా టీజర్ విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్, కియారా అద్వానీ(Kiara Advani), ఎస్ జె సూర్య, అంజలి(Anjali) కలిసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి హైప్ పెంచారు. ప్రజెంట్ గేమ్ చేంజర్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story