Classification of SC : ఆత్మగౌరవ సభకు తరలి వెళ్లిన మాలలు

by Naveena |
Classification of SC : ఆత్మగౌరవ సభకు తరలి వెళ్లిన మాలలు
X

దిశ,కొల్లాపూర్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో.. కొల్లాపూర్,పెద్దకొత్తపల్లి కోడేరు మండలాల నుంచి మాలలు ఆత్మగౌరవ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. మాలల ఆత్మగౌరవ సభ పేరుతో..జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు మాల సామాజిక వర్గానికి చెందిన మహిళలు యువకులు, విద్యార్థి ఉద్యోగులు సైతం ప్రత్యేక వాహనాలలో భారీ ఎత్తున వెళ్లారు. కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ రిజర్వేషన్(Reservation )పోరాట కమిటీ తాలూకా కన్వీనర్ బిజ్జ దేవదాస్,సంఘం నాయకులు చెన్నయ్య, బిజ్జ వేణు,అవుట చెన్నయ్య, బండి శీను, రామదాసు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం వారు మాట్లాడుతూ.. జనాభా కనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 25కు పెంచాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టుతో ఇప్పించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.341 ఆర్టికల్ ద్వారా పార్లమెంటులో బిల్లు సవరణ చేసి బిల్లు పెట్టి పాస్ చేసిన తర్వాత నే వర్గీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రాలు చేసే వర్గీకరణ తమకొద్దని వారు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed