- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: 25000 మంది పాలస్తీనియన్లు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి జరుగుతున్న యుద్ధంలో 25000 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దాదాపు 300 మంది క్షతగాత్రులతో పాటు సుమారు 178 మృతదేహాలను ఆస్పత్రులకు తీసుకొచ్చినట్టు ఆరోగ్య శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు. మూడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో మొత్తం 25,105 మంది పాలస్తీనియన్లు మరణించారని, మరో 62,681 మంది గాయపడ్డారని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల శిథిలాల కింద, వైద్యాధికారులు వారిని చేరుకోలేని ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు. మరణించిన వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు, మైనర్లే ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం సాక్ష్యాలు అందించకుండానే దాదాపు 9,000 మంది మిలిటెంట్లను హతమార్చిందని తెలిపారు. హమాస్‌ను కూల్చివేసి, బందీలుగా ఉన్న వారందరినీ తిరిగి తీసుకువచ్చే వరకు దాడిని కొనసాగిస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.