India: లెబనాన్ కు భారత్ ఔషధ సాయం

by M.Rajitha |   ( Updated:2024-10-18 12:29:21.0  )
India: లెబనాన్ కు భారత్ ఔషధ సాయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య దాడుల నేపథ్యంలో లెబనాన్ కు భారత్ ఔషధ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలని నిర్ణయించింది. 33 టన్నుల మందులు, వైద్య సామగ్రిని పంపేందుకు నిర్ణయించిన కేంద్రం.. తొలి విడతగా 11 టన్నుల మందులను, సామగ్రిని శుక్రవారం ప్రత్యేక విమానంలో పంపించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడదల చేశారు. ముఖ్యంగా ఈ ఔషధాల్లో గుండెకు సంబంధించినవి, యాంటీ బయోటిక్స్, అనస్తీషియాకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed