- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత సంతతి గణిత శాస్త్రవేత్త సుబ్రమణ్యం కన్నుమూత: రూట్ వన్ కంపెనీ సృష్టికర్తగా ప్రసిద్ధి
దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన గణిత శాస్తవేత్త డాక్టర్ టీఎన్ సుబ్రమణ్యం(76) అమెరికాలోని మిచిగాన్‌లో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.1979లో అమెరికాకు వలస వెళ్లిన సుబ్రమణ్యం..జనరల్ మోటార్స్ కోసం రూట్ వన్ కంపెనీ, సర్వర్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందారు. భారత్, యూఎస్‌లలో అనేక గణిత సిద్ధాంతాలను రూపొందించారు. యూఎస్‌కు వెళ్లిన ఆయన మొదట ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో కొన్నేళ్లపాటు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఒక్లాండ్ కు మారిన తర్వాత కూడా గణితం బోధంచారు. అనంతరం కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఆటోమేటివ్ తయారీ సంస్థ కోసం రూట్ వన్ కంపెనీని స్థాపించారు. ఇది అన్ని జీఎం కార్లు, జీపీఎస్ సిస్టమ్‌లకు ఆటో-ఫైనాన్సింగ్‌ను నిర్వహిస్తుంది.
సుబ్రమణ్యం విజయాలు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఇందిరా అమెరికా పర్యటనలో ఉండగా..సుబ్రమణ్యంను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఆయన చేసిన పనులపై ప్రశంసించారు. మున్ముందు కూడా దేశం గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించారు. సుబ్రమణ్యం మృతి పట్ల విద్యా, సాంకేతిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. కాగా, సుబ్రమణ్యంకు భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. అతని అల్లుడు అమెరికాలోని మేరీల్యాండ్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్ పరిపాలన విభాగంలో పనిచేస్తున్నారు. సుబ్రమణ్యం సోదరుడు టీఎన్ అశోక్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ కావడం గమనార్హం.