హమాస్ న్యూ చీఫ్ యహ్యా సిన్వార్

by M.Rajitha |
హమాస్ న్యూ చీఫ్ యహ్యా సిన్వార్
X

దిశ, వెబ్ డెస్క్ : పాలస్తీనా మిలిటెంట్స్ గ్రూప్ హమాస్ కు న్యూ చీఫ్ గా యహ్యా సిన్వార్ నియమితులయ్యారు. ఇంతక ముందు చీఫ్ గా పనిచేసిన ఇస్మాయిల్ హానియే మరణించిన తర్వాత నిన్న హమాస్ కొత్త చీఫ్ ను ప్రకటించింది. కాగా పాలస్తీనాలో అల్లర్లు మొదలైనప్పటి నుండి సిన్వార్ గాజాలో ఉన్నట్టు సమాచారం. అనేకసార్లు ఇతన్ని చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించినప్పటికీ తప్పించుకున్న సిన్వార్ కు అక్టోబర్ 7 దాడుల రూపశిల్పిగా పేరుంది. కొత్త చీఫ్ గా ఎన్నికైన అనంతరం.. ఇస్మాయిల్ అమరుడని పేర్కొంటూ హమాస్ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు సిన్వార్. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మొట్ట మొదట దాడికి పాల్పడింది సిన్వార్ నేతృత్వంలోనే. ప్రస్తుత హమాస్ క్లిష్ట పరిస్థితుల్లో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సిన్వార్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు అనేది అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed