Vitamin deficiency : ఏమీ తోచని అయోమయం.. మనుషుల్లో ఈ లక్షణాలకు కారణం అదే..

by Javid Pasha |
Vitamin deficiency : ఏమీ తోచని అయోమయం.. మనుషుల్లో ఈ లక్షణాలకు కారణం అదే..
X

దిశ, ఫీచర్స్: ఉన్నట్లుండి మూడ్ మారిపోతోందా?.. ఏమీ తోచని అయోమయంలో కూరుకుపోతున్నారా? ఆందోళనగా అనిపిస్తోందా?, రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? అయితే మీ శరీరంలో ఏదో జరగుతున్నట్లే లెక్క. ముఖ్యంగా 5 రకాల విటమిన్లు లోపిస్తే ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* విటమిన్ బి 9 : శరీరంలో విటమిన్ బి9 లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లయితే అయోమయంగా, ఆందోళనగా అనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కొత్త కణాల నిర్మాణానికి ఆటకం కల్పిస్తుంది. ఫలితంగా అలసట, నిరాశ, నిస్పృహ, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏకాగ్రతలోపిస్తుంది. సడెన్‌గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బయటపడాలంటే తరచుగా ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి ఫోలేట్ పరిమాణం అధికంగా ఉండే ఆహారాలు తగినంగా తీసుకుంటూ ఉండాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

* ఐరన్ లోపం : శరీరంలో ఐరన్ లోపం ఉంటే ప్రవర్తనలో అయోమయం నెలకొంటుంది. హిమోగ్లోబిన్ తయారీలో శరీరానికి ఐరన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే ఎనీమియా వంటి రక్తహీనత వ్యాధులు వస్తాయి. దీంతో శరీరంలోని అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఫలితంగా నీరసం, తీవ్రమైన అలసట, కళ్లు, తల తిరగడం వంటివి సమస్యలు సంభవిస్తుంటాయి. ఆకు కూరలు, గుడ్లు, మాంసం వంటివి రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించచ్చు.

*విటమిన్ డి : శరీరంలో విటమిన్ డి లోపం కూడా అలసట, అయోమయానికి, మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాల్షియం అది సరిగ్గా ఉన్నప్పుడే సరైన శక్తి లభిస్తుంది. లేకుంటే కండరాలు, ఎముకల బలహీనత ఏర్పడుతుంది. సమస్య నుంచి బయటపడాలంటే రోజూ కాసేపు ఉదయపు ఎండలో నిలబడాలి. ఇలా చేస్తే విటమిన్ డిని శరీరం సహజంగానే పొందుతుంది. దీంతోపాటు ఫ్యాటీ చేపలు, గుడ్లు, వంటివి తినాలి.

* విటమిన్ బి12 : ఈ విటమిన్ లోపిస్తే నరాల బలహీనత, నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తాయి. మానసిక పరిస్థితిలో మార్పులు రావచ్చు. నిజానికి విటమిన్ బి 12 శరీరానికి చాలా ముఖ్యం. ఇది రక్తనాళాలను, కణాలను ఉత్తేజ పరుస్తుంది. ఇలాంటప్పుడు పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, బీన్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.

* మెగ్నీషియం : మెగ్నీషియం లోపిస్తే శరీరంలో నాడి వ్యవస్థ, కండరాలు సక్రమంగా పనిచేయవు. మానసిక పరిస్థితి గాడితప్పుతుంది. దీంతో ఏమీ తోచక ఇబ్బంది పడుతుంటారు. తరచుగా ఆందోళన, ఒత్తిడి వేధిస్తాయి. తృణ ధాన్యాలు, గింజలు, పప్పులు, గుడ్లు, మాసం వంటివి తీసుకుంటూ ఉంటే ఈ లోపం నుంచి బయటపడవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed