- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీంలోని స్ట్రెస్ హార్మోన్లతో ఇంత ప్రమాదమా ?
దిశ, వెబ్ డెస్క్ : జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు మనం చాలా కాలంగా అలాగే గుర్తుంచుకుంటాం. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మనం మరచిపోవాలనుకుంటున్నా అస్సలు మర్చిపోలేము. భయంకరమైన ప్రమాదాలు జరిగినా, అనుకోని సంఘటనలు ఎదురైనా అవి ఎప్పుడూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. చాలా సార్లు ఈ జ్ఞాపకాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇలాంటి జ్ఞాపకాలను మన మనస్సు నుండి ఎందుకు చెరిపివేయలేకపోతున్నాము అనే ప్రశ్న చాలాసార్లు చాలా మందికి తలెత్తుతుంది. దీంతోపాటు బ్రెయిన్‌కు 2.5లక్షల గిగాబైట్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.. అంటే దాదాపుగా అన్ లిమిటెడ్ స్టోరేజ్ అన్నమాట.. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ జ్ఞాపకాలతో లాభాలు ఉన్నాయి.. నష్టాలు ఉన్నాయి.. ఇలా బ్రెయిన్ కు సంబంధించిన ఎన్నో అంశాలపై శాస్త్రవేత్తలు ఎలాంటి అధ్యయనం చేశారో, నివేదికలో ఏం వెల్లడించారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రెస్ హార్మోన్లు..
మానవ మెదడులోని 'అమిగ్డాలా' అనే భాగం జ్ఞాపకాలకు సంబంధించిన భావోద్వేగాలను నియంత్రిస్తుందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మెదడులోని హిప్పోకాంపస్ అనేది జ్ఞాపకాలు ఏర్పడే ప్రాంతం. జీవితంలో భయానక లేదా బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ జ్ఞాపకాలకు అమిగ్డాలా మెదడులో నిల్వ చేస్తుంది. ఈ జ్ఞాపకాలన్నీ 'లింబిక్ సిస్టమ్' విభాగంలో అలాగే నిండి ఉంటాయి. అడ్రినలిన్, కార్టిసాల్ వంటి 'స్ట్రెస్ హార్మోన్లు' ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లు భయం, ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పెరుగుతాయి. దాని కారణంగా ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు చాలా కాలం పాటు మనస్సులో అలాగే నిలిచి ఉంటాయి.
నోస్టాల్జియా శాస్త్రం..
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మానవ మెదడు భయంకరమైన, బాధాకరమైన జ్ఞాపకాలను భద్రతా యంత్రాంగంగా భద్రపరుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఇది వారి మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనేక సందర్భాల్లో, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కారణంగా, భయానక జ్ఞాపకాలు మళ్లీ ఈ పాత గాయాలను రిఫ్రెష్ చేస్తాయి. దీని కారణంగా వ్యక్తి మళ్లీ మళ్లీ అదే జ్ఞాపకాలను గుర్తుంచుకుంటాడు.
జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి.. ?
మెదడులో ఉండే "హిప్పోకాంపస్" భాగంలో జ్ఞాపకాలను నిల్వ చేయగలదు. అయితే మెదడులోని "ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్" (PFC)లో భయానక జ్ఞాపకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్ నిర్ణయాలు తీసుకోవడానికి, మనిషి ప్రవర్తనను నియంత్రించడానికి బాధ్యత వహించే మెదడులోని భాగం. ఈ జ్ఞాపకాలు మనసులో నెట్‌వర్క్‌ని ఏర్పరచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. భయానక సంఘటనలు సంభవించినప్పుడు లేదా ఒక వ్యక్తి భయానక ప్రదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఈ జ్ఞాపకాలు సక్రియం చేయబడతాయి. మెదడులో ప్రకంపనలు సృష్టించడం ప్రారంభిస్తాయి.
ఎలుకలపై చేసిన అధ్యయనం..
మెదడును పరిశీలించేందుకు తొలుత ఎలుకలపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. వాటికి తేలికపాటి విద్యుత్ షాక్‌లు ఇచ్చారట. తరువాత సాధారణ స్థితిలో ఉంచారట. ఒక నెల తరువాత, ఎలుకను తిరిగి అదే ప్రదేశానికి తీసుకువచ్చినప్పుడు, దాని ముందు భాగంలోని కార్టెక్స్ చురుకుగా మారింది. ఆ ఎలుక భయానక జ్ఞాపకాలు మళ్లీ దానికి గుర్తువచ్చినట్లు చూపిస్తుంది. న్యూరో సైంటిస్ట్ జున్-హ్యోంగ్ చో ప్రకారం, భయంకరమైన జ్ఞాపకాలు ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్ మెమరీ సర్క్యూట్‌లను భంగపరుస్తాయి. ఇది వ్యక్తిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)కి దారితీయడమే కాకుండా, మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తవానికి, దీని కారణంగా, ఒక వ్యక్తి క్రమంగా నిరాశకు గురవుతాడు.
PTSD ప్రమాదం..
అమెరికాలో జనాభాలో 6% మంది PTSDని ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి భయానక అనుభవాలను పదేపదే గుర్తుంచుకుంటే మానసికంగా, శారీరకంగా ప్రభావితమైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
జ్ఞాపకాలను ఎప్పుడు చెరిపివేయవచ్చు ?
శాస్త్రవేత్తలు తెలిపిన ఈ అధ్యయనం గురించి నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. దాని ఆధారంగా, శాస్త్రవేత్తలు ఇప్పుడు మెదడు ఈ సర్క్యూట్‌ను ఎలా పరిష్కరించవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దిశలో పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, PTSD వంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన దశ.
జ్ఞాపకాలు ఇక్కడ కూడా ఉంటాయి..
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు మన జ్ఞాపకాలు మన మెదడులో మాత్రమే భద్రపడి ఉంటాయని చెబుతున్నారు. అయితే ఒక పరిశోధన ఈ అవగాహనను కూడా మార్చింది. జ్ఞాపకాలు మెదడులోనే కాకుండా శరీరంలోని సాధారణ కణాలలో కూడా ఉంటాయని తెలిపారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం (NYU) శాస్త్రవేత్తలు పరిశోధనలో పునరావృతం చేయడం ద్వారా నేర్చుకునే సామర్థ్యం శరీరంలోని అన్ని కణాలలో ఉందని కనుగొన్నారు.
'అభ్యాసం' అనేది మెదడుకు మాత్రమే పరిమితం కాదు..
జ్ఞాపకాలను ఏర్పరచుకోవడం కేవలం మెదడు, మెదడు కణాలకు మాత్రమే పరిమితం కాదని న్యూరో సైంటిస్ట్ నికోలాయ్ కుకుష్కిన్ చెప్పారు. శరీరంలో ఉండే ఇతర కణాలు కూడా మనిషికి సంబంధించిన జ్ఞాపకాలను నిల్వ చేయగలవని అతని పరిశోధనలో తేలింది. కుకుష్కిన్ ప్రకారం, ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు మరింత ప్రభావవంతమైన చికిత్సలకు దారి తీస్తుంది.
మీకు తెలుసా ?
1. మెదడులో 2,5లక్షల గిగాబైట్ల జ్ఞాపకాలను నిల్వ చేసుకోవచ్చు.. అంటే 300 సంవత్సరాలపాటు టీవీలో వచ్చే అన్ని షోలతో ఇది సమానం.
2. ప్రతి సెకను అనేక కోణాల్లో మెదడు ఆలోచిస్తుంది. అయితే, మరి చిన్న చిన్న విషయాలు ఎందుకు మరిచిపోతుంటాం.? జ్ఞాపకాలను మెదడు లాంగ్ టర్మ్ మెమోరీ.. షార్ట్ టర్మ్ మెమోరీ అని రెండు రకాలుగా వర్గీకరించుకుంటుంది. అయితే, ఏ అంశాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవాలి.. వేటిని తక్కువకాలం గుర్తుంచుకోవాలన్నది మనిషి నిర్ణయించలేడు.
3. విద్యార్థులకు పరీక్షల సమయంలోనే ఎక్కువగా చదివినవన్నీ మరిచిపోతుంటారు.. దానికి కారణం వారిలోని భయమే. పరీక్షలు అనగానే విద్యార్థుల్లో నెలకొనే భయం కారణంగానే మెదడులో ఆ చదువుకున్న విషయాలు నిక్షిప్తం కావు.. ఇష్టంతో చదివితే అవి గుర్తుకువస్తాయి. అంతేకానీ, పరీక్షల్లో రాయడంకోసమే చదివితే.. వాటిని మెదడులో రిజిస్టర్ చేయలేరట.
4. మెదడులోని 60శాతం కొవ్వులతో నిండి ఉంటుంది. శరీరంలో అత్యంత కొవ్వు ఉండే అవయవం ఇదే.
5. మనిషి మెదడులో 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. వీటి ఆధారంగానే నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ న్యూరాన్ల మధ్య 1000 ట్రిలియన్ల సంఖ్యలో కనెక్షన్లు ఉంటాయి. ఇందులోనే జ్ఞాపకాలు పదిలమవుతాయి. కొందరిలో ఇవి యాక్టివ్ గా ఉంటే మనిషి జ్ఞాపక శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.
6. మనిషి మెదడు గంటకు దాదాపు 350 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట.
7. న్యూరాన్లు దెబ్బతినడం వల్లనే మనుషులకు అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వస్తుంది.
8. నాలుగేళ్లకు మనిషిలో వెన్నెముక పూర్తిస్థాయిలో ఏర్పడుతుంది. అప్పటినుంచి మెదడునుంచి వెన్నెముక ద్వారా శరీరంలోని అన్ని వ్యవస్థలకు హెచ్చరికలు అందుతాయి. 25ఏళ్లకు మెదడు పూర్తిగా ఏర్పడుతుంది.
9. కొందరు బ్రెయిన్ లెస్ ఫెలో అని.. మరికొందరు మెదడు 10శాతం కూడా వాడడు అని తిడుతుంటారు. కానీ, మెదడు లేకుండా ఎవరూ పుట్టరు. అదే సమయంలో మెదడును ఇంత శాతం ఉపయోగించాలి.. అని ఎవరూ నిర్దేశించలేరు. పుట్టినక్షణం నుంచి ప్రతి ఒక్కరూ మెదడును 100శాతం వాడుతారు. అంతెందుకు నిద్రపోయినప్పుడు కూడా మెదడు యాక్టివ్‌గానే ఉంటుంది. అయితే, మెదడు పనిచేసేందుకు 20 వాట్ల శక్తి అవసరం.. ఇది మనిషి నిద్రపోయినప్పుడు మాత్రమే మెదడుకు అందుతుంది. అంటే మొబైల్ చార్జింగ్ పెట్టినట్లు అన్నమాట. నిద్ర సరిగాపోకపోతే తెల్లవారి అంతా డల్ గా ఉండటానికి కారణం ఇదే.
10. మానవుల్లో మెదడు బరువు 3 పౌండ్లు ఉంటుంది. అయితే, ఆడవారితో పోల్చితే మగవారిది కాస్త పెద్దదిగా ఉంటుంది. కానీ, తెలివితేటలకు మాత్రం వారి వారి శక్తిసామర్థ్యాలే కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
11. ఏదైనా సమాచారం కోసం గూగుల్ లో వెతుకుతాం. కానీ, ఏదైతే సమాచారం కోసం వెతుకుతున్నామో.. మెదడు అప్పటికే వెతకడం ప్రారంభిస్తుంది. నీ మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలను సిద్ధం చేసి.. గూగుల్ లో లభించే సమాచారంతో పోల్చి సందేశాలను ఇస్తుందట.
12. ప్రతి మనిషిలో 15 నుంచి 25 ఏండ్ల వరకు జరిగే మధుర స్మృతులను మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుందట.