Olive Oil: ఆలివ్ ఆయిల్ ఎందుకంత ఖరీదు ఉంటుంది? ఆరోగ్యానికి చేసే మేలేంటి?

by Anjali |   ( Updated:2024-09-24 11:41:02.0  )
Olive Oil: ఆలివ్ ఆయిల్ ఎందుకంత ఖరీదు ఉంటుంది? ఆరోగ్యానికి చేసే మేలేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: వందల ఏళ్లుగా వంటకాల్లో విరివిగా వాడుతోన్న ఆలివ్ ఆయిల్ వల్ల బోలెడు ఉపయోగాలున్నాయి. ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఒలియోకాంతల్ అనే పదార్ధం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేలు చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. WHO సూచించిన దాని ప్రకారం రోజూ రెండు టేబుల్ స్పూన్లు లేదా నాలుగు టేబుల్ స్ఫూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ కాలం జీవించే అవకాశాలను పెంచుతుందని వెల్లడించారు.

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు.దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆర్థరైటిస్, క్యాన్సర్, డయాబెటిస్ ప్రమాదాన్ని దరి చేరనివ్వు. ఆలివ్ ఆయిల్ వాపులను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవుతారు. ఒత్తిడిని తగ్గిస్తుంది. మైండ్‌ను యాక్టివ్‌గా ఉంచి.. మెమోరీ పవర్‌ను పెంచుతుంది.

అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్‌లోని మినర్స్, విటమిన్స్ స్కిన్ గ్లోను పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి వర్జిన్ ఆలివ్ అయిల్, రెండు రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్, ప్యూర్ ఆలివ్ ఆయిల్.

ఆలివ్ ఆయిల్ ధర..

ఆలివ్ ఆయిల్ ధరలను చూసినట్లైతే.. రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. వర్జిన్ ఆయిల్ ధర లీటరుకు రూ.600 నుంచి రూ.750 వరకు ఉంటుంది. ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లీటర్ కు రూ. 650 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.

ఎందుకు అంత ఖరీదు..

ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలివ్ ఆయిల్ చెట్ల సాగు తగ్గిపోతుంది. చాలా వరకు ఈ పంటలు ఎండిపోతున్నాయి. గతంతో పోల్చుకుంటే 15 శాతం ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఆలివ్ ఆయిల్ వాడకం ఎక్కువ అవుతుంది. ఉత్పత్తి తక్కువ ఉండటంతో దీనికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed