- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలి
దిశ, మక్తల్: ఆస్పత్రి పరిధిలోని గర్భిణీలకు సాధారణ డెలివరీ అయ్యేలా చూడాలని చికిత్సకు వచ్చిన పేషెంట్ల పై నిర్లక్ష్యం వహించరాదని, ఇతర ఆస్పత్రికి పేషంట్లను రిఫర్ చేయడం తగ్గించుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సిబ్బందితో అన్నారు. ఏరియా ఆసుపత్రిగా ప్రమోట్ అయిన తర్వాత డాక్టర్లు కొరత, సిబ్బంది కొరత, మందుల కొలత వివరాలు తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయంపై దృష్టి సారించాలని అక్కడున్న సిబ్బందితో అన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, పేషెంట్ క్రిటికల్ పరిస్థితి ఉంటేనే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రి కేంద్రాలకు రిఫర్ చేయాలని అన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది..డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటారనే బయట పుకార్లకు పాపులిస్ట్ పడాలన్నారు.
మంగళవారం ఉదయం మక్తల్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెలవారి ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి ఇప్పటి వరకు ఆస్పత్రిలో చికిత్స పొందిన పేషెంట్ల వివరాలు, మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రికి రిఫర్ చేసిన పేషెంట్ల డేటా పరిశీలించారు. సహజ, సిజేరియన్ కాన్పుల వివరాలను రికార్డులో నమోదు చేయాలని ఈ వివరాలన్నీ వచ్చే నెలకు పురోగతి ఉండాలని డాక్టర్లతో అన్నారు.