Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని పీఠం పై 'మూడో మహిళ'.. హరిణి అమరసూర్య ప్రమాణం

by Geesa Chandu |
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని పీఠం పై మూడో మహిళ.. హరిణి అమరసూర్య ప్రమాణం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక(Sri Lanka) నూతన ప్రధాని (New PM) గా హరిణి అమర సూర్య(Harini Amarasuriya) ప్రమాణ స్వీకారం చేశారు.మంగళవారం ఆమె ప్రమాణ స్వీకారం జరిగింది. సిరిమావో బండారు నాయకే(1994-2000), చంద్రిక కుమారతుంగ(ఆగస్టు 19,1994-నవంబర్ 12,1994) తర్వాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మూడో మహిళా నేతగా, 16 వ ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య చరిత్ర తిరగరాసింది.

నేషనల్ పీపుల్స్ పవర్(NPP) సోషలిస్ట్ రాజకీయ కూటమికి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంక లో దిస నాయకేతో పాటు మొత్తం నలుగురితో ప్రభుత్వం కొలువుదీరింది.నూతన ప్రధానిగా పదవి చేపట్టిన హరిణి అమరసూర్యకు పలు శాఖలను అప్పగించారు. వాటిలో విద్య, న్యాయ శాఖ, కార్మిక, శాస్త్ర సాంకేతిక శాఖ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఆరోగ్య శాఖలు ఉన్నాయి. అయితే నిన్న(సోమవారం) అధికార మార్పిడిలో భాగంగా.. శ్రీలంక ప్రధానిగా ఉన్న దినేష్ గుణ వర్ధన తన పదవికి రాజీనామా చేశారు.

శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీలోని సోషల్ స్టడీస్ విభాగంలో సీనియర్ లెక్చరర్ అయిన హరిణి అమరసూర్య.. 2020 లో నేషనల్ పీపుల్స్ పవర్(NPP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రధాన మంత్రి హోదాలో విద్య, న్యాయ శాఖ, కార్మిక, శాస్త్ర సాంకేతిక శాఖ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వహించనున్నారు. అయితే లిబరల్ భావజాలం కలిగిన ఆమె.. లింగ అసమానతలు, శిశు సంరక్షణ, నిరుద్యోగం, దేశ విద్యావ్యవస్థలో లోపాలు వంటి కీలక అంశాలపై పరిశోధన చేసి పలువురి ప్రశంసలు అందుకుంది. కాగా సోమవారం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిస నాయకే ప్రమాణం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Next Story