- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Unemployment: SC, ST, ఇతర వెనుకబడిన వర్గాల్లో తగ్గిన నిరుద్యోగం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల్లో నిరుద్యోగం తగ్గినట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాలో వెల్లడైంది. ముఖ్యంగా సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ (అందరికీ అభివృద్ధి) అనే ప్రభుత్వ నినాదం వెనుకబడిన వర్గాల ప్రజల ఉద్యోగాల విషయంలో స్పష్టమైన పురోగతికి తోడ్పాటుగా నిలిచింది. నివేదిక ప్రకారం, సాధారణ కేటగిరీతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగిత రేటు గత ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 2023-24లో సాధారణ కేటగిరీతో పోల్చితే ఈ వర్గాల్లో నిరుద్యోగిత రేటు ఇంకా ఎక్కువగానే ఉంది.
2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో SC, ST, OBCలకు చెందిన స్త్రీల కంటే పురుషుల నిరుద్యోగిత రేటు వేగంగా తగ్గింది. కానీ జనరల్ కేటగిరీకి సంబంధించి పురుషుల కంటే స్త్రీల నిరుద్యోగ తగ్గింపు వేగంగా ఉంది. మతాల వారీగా చూసినట్లయితే సిక్కులు గత ఏడు సంవత్సరాలలో అతి తక్కువ పురోగతిని సాధించారు. ఇతర మత సమూహాలతో పోల్చితే వీరి నిరుద్యోగిత రేటు 5.8 శాతంగా ఉంది. అలాగే, క్రైస్తవుల నిరుద్యోగం 4 శాతం, ముస్లింల నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉంది.
ఈ వర్గాల్లో పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉపాధి, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ముస్లింలలో మహిళల నిరుద్యోగం రేటు 5.1 శాతం, క్రైస్తవులలో 6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది వరుసగా 8 శాతం, 7.8 శాతం వద్ద ఉంది. ముఖ్యంగా పట్టణ నిరుద్యోగం తగ్గుదల కారణంగా మహిళల పరిస్థితి మెరుగుపడిందని సర్వేలో వెల్లడైంది.