Bangladeshi nationals arrest: మహారాష్ట్రలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

by Shamantha N |
Bangladeshi nationals arrest: మహారాష్ట్రలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో అక్రమంగా ఉంటున్నారన్న ఆరోపణలపై పాల్ఘర్ జిల్లాలో ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు పాల్ఘర్ లోని నాలా సుపారాలోని స్లమ్ ఏరియాలో అధికారులు దాడులు చేపట్టారు. పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఇన్ స్పెక్టర్ సౌరభి పవార్ తెలిపారు. నిందితులు అర్షద్ రహమతుల్లా గాజీ (52), అలీ మహ్మద్ దీన్‌మహమ్మద్ మండల్ (56), మిరాజ్ సాహెబ్ మండల్ (19), సాజద్ కదిర్ మండల్ (45), సాహెబ్ పంచనన్ సర్దార్ (45) గా గుర్తించారు. భారతదేశంలో నివసించేందుకు వారిదగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించారు. వీరంతా పదేళ్ల క్రితం నది మార్గంలో దేశంలోకి ప్రవేశించి కూలీలుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫారెన్ యాక్ట్- 1946, పాస్ట పోర్టు యాక్ట్ -1950 నిబంధన ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Next Story

Most Viewed