ఛానల్ డిలీట్ చేయడం పై స్పందించిన రోజా.. అభిమానులకు కీలక రిక్వెస్ట్

by Mahesh |   ( Updated:2024-09-24 15:46:45.0  )
ఛానల్ డిలీట్ చేయడం పై స్పందించిన రోజా.. అభిమానులకు కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి రోజా తన యూట్యూబ్ ఛానల్‌లో తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందిస్తూ.. పోల్ పెట్టగా.. అందులో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. దీంతో అప్రమత్తం అయిన రోజా తన పోల్ ను, యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేసిందని ఆమె పెట్టిన పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కాగా ఈ ట్రోల్స్ పై తాజాగా మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌లో.. "నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్, త్రెడ్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్‌లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూ టిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను." అని మాజీ మంత్రి రోజా రాసుకొచ్చారు.

Read More : ఎవరి పాలన బాగుందని పోల్.. నెటిజన్ల దెబ్బకు ఛానల్ డిలీట్ చేసిన రోజా

Advertisement

Next Story