బుమ్రాను టిప్పర్ లారీతో పోల్చిన అశ్విన్.. ఎందుకో తెలుసా?

by Harish |
బుమ్రాను టిప్పర్ లారీతో పోల్చిన అశ్విన్.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టులో తానే ఫిట్టెస్ట్ ప్లేయర్‌నని స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ గాయపడుతుంటాడని, బుమ్రాకు అహంకారం పెరిగిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఆ విషయంలో తాజాగా బుమ్రాకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. భారత క్రికెట్‌కు బుమ్రా కోహినూర్ డైమండ్ లాంటివాడనని ప్రశంసించాడు.

తన యూట్యూబ్ చానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ..‘బుమ్రా గంటకు 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. భారత క్రికెట్‌కు అతను రత్నకిరీటం. కోహినూర్ వజ్రం లాంటివాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. కపిల్ దేవ్ తర్వాత బుమ్రా కంటే గొప్ప భారత బౌలర్ ఇంకెవరైనా ఉన్నారా?. బుమ్రా గాయాలపాలవుతూ ఉంటాడని, అతను ఎలా ఫిట్టెస్ క్రికెటర్ అవుతాడు? అని కొంతమంది అంటున్నారు. కానీ, చాలా తేడా ఉంది. ఉదాహరణకు.. ఒక టిప్పర్ లారీ, ఒక మెర్సిడెస్ బెంజ్‌ను తీసుకుందాం. మెర్సిడెస్ బెంజ్‌‌ను డ్రైవర్ చాలా జాగ్రత్తగా నడుపుతాడు. అదే టిప్పర్ లారీ భారీ లోడ్‌తో దేశం మొత్తం తిరుగుతుంది. ఫాస్ట్‌ బౌలర్‌ కూడా టిప్పర్‌ లారీ లాంటోడే. ఒక్కోసారి బ్రేక్‌ డౌన్‌ అవుతుంది. బుమ్రా కూడా గాయపడినా.. కోలుకుని వచ్చి గంటకు 145 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. కాబట్టి, అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.’ అని వ్యాఖ్యానించాడు.

Advertisement

Next Story