వైద్యం వికటించి యువకుడు మృతి చెందాడని ఆందోళన

by Sridhar Babu |
వైద్యం వికటించి యువకుడు మృతి చెందాడని ఆందోళన
X

దిశ, లక్షెట్టిపేట : ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి యువకుడు మృతి చెందాడని జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో చేశారు. ఈ ఘటన దండేపల్లి మండలం కొత్తకొమ్ముగూడ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకొమ్ముగూడ గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ (26) అనే యువకుడికి జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయగా డెంగ్యూ అని తేలింది.

పరీక్షలు చేయించుకుని ఇంటికి వచ్చిన అతడు గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ చేయించుకున్నాడు. ఆ ఇంజక్షన్ వికటించి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కోమాలోకి వెళ్లాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించడంతోనే మధుకర్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. కాగా రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగిన బంధువులు, కుటుంబ సభ్యులను పోలీసులు సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story