‘దేవర’లో ‘చుట్టమల్లే..’ సాంగ్‌ని క్యూట్‌గా పాడిన అలియా భట్.. వీడియో వైరల్

by sudharani |
‘దేవర’లో ‘చుట్టమల్లే..’ సాంగ్‌ని క్యూట్‌గా పాడిన అలియా భట్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జిగ్రా’. ఇది అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్‌లో భాగంగా.. ఎన్టీఆర్, అలియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనీకి దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఇందులో ఎన్టీఆర్ ‘దేవర’, అలియా ‘జిగ్రా’ ముచ్చట్లు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అలియా ‘దేవర’ లో ‘చుట్టమల్లె.. చుట్టేస్తాంది’ సాంగ్‌ను తెలుగులో చాలా క్యూట్ పాడింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకక్కెంచిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, అలియా కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్‌ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించినప్పటికీ, ఎన్టీఆర్‌తోనూ ఆమె సన్నివేశాలు ఉంటాయి. దీంతో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు ‘దేవర’, ‘జిగ్రా’ ప్రమోషన్స్‌లో కలిసి మరోసారి సందడి చేశారు.

Next Story