జాబ్ గ్యారంటీ నైపుణ్య కోర్సులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్

by M.Rajitha |
జాబ్ గ్యారంటీ నైపుణ్య కోర్సులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) విద్యార్థుల కోసం దేశంలోనే ఓ సరికొత్త ప్రయోగం చేపడుతోంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీ కోర్స్ తోపాటు, నైపుణ్య శిక్షణను అందించే బీఎఫ్ఎస్ఐ(BFSI) కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు(Sridhar Babu) చేతుల మీదుగా రేపు ఈ ప్రత్యేక కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కాగా ఈ కోర్సును అందించే కాలేజీల లిస్టును ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చేత గుర్తించబడిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయగా.. ఈ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు తొలుత ఈ శిక్షణను అందించనున్నారు. EQUIPPP అనే సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమానికి రూ. 2.50 కోట్లు అందించేందుకు ముందుకు రావడంతోపాటు, సీఎస్ఆర్(CSR) నిధులు కూడా సమీకరించనుంది.

Next Story