Imports: దిగుమతి నిర్వహణ వ్యవస్థను పొడిగించిన ప్రభుత్వం

by S Gopi |
Imports: దిగుమతి నిర్వహణ వ్యవస్థను పొడిగించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మార్కెట్‌ సరఫరాకు ఇబ్బందుల్లేకుండా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా కొన్ని ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతులకు ఉద్దేశించిన దిగుమతి నిర్వహణ వ్యవస్థను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది. జనవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాల ఆధారంగా దిగుమతుల కోసం తాజా అనుమతులు పొందాలని కంపెనీలను కోరింది. త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) మంగళవారం నోటిఫికేషన్‌లో తెలిపింది. వస్తువుల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశంలో ఎలక్ట్రానిక్స్ కోసం విశ్వసనీయ సరఫరా వ్యవస్థ కోసం ప్రభుత్వం దిగుమతి నిర్వహణ వ్యవస్థను 2023, నవంబర్ 1న ప్రారంభించింది.

Advertisement

Next Story