Health: సమ్మర్‌లో ఈ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by D.Reddy |
Health: సమ్మర్‌లో ఈ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు నిమ్మకాయ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇక సమ్మర్‌లో రోజు ఉదయాన్నే లెమన్ టీ (Lemon tea) తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్‌ Cతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

ఎండకాలంలో లెమన్‌ టీ తాగితే హైడ్రేషన్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఐరన్‌ లోపాన్ని కూడా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లెమన్ టీలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సాయపడుతాయి. అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేదుకు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, శరీర బరువును నియంత్రిస్తుంది. ప్రతి రోజు వేసవిలో లెమన్ టీ తాగడం వల్ల సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించేందుకు సహాయపడుతుంది.

లెమన్ టీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను స్థాయిలను తగ్గించేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సహజ శక్తిని అందిస్తుంది. ఇవే కాకుండా గొంతు నొప్పి, శ్వాసకోస సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, ఈ టీలో తగినంత ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు నిమ్మ టీ మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మీకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి సహాయపడుతుంది.

Next Story

Most Viewed