- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు! ఆ భయంతోనే డీలిమిటేషన్‌పై ఆరోపణలు: ఎంపీ అర్వింద్

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ఓటమి భయంతోనే (delimitation) డీలిమిటేషన్ పై డీఎంకే (DMK) ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Arvind Dharmapuri) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ అనేది దేశానికి బూచిగా చూపించే ప్రయత్నంలో భాగమే ఈ సమావేశమని ఆయన మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటే సపరేట్ చేసి మాట్లాడితే పదును ఉండదని, దక్షిణ భారత్ మొత్తం కలుపుకుంటున్నారని వివరించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. జనాభా యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఒకే విధంగా పెరిగిందని, తమిళనాడు రాష్ట్రంలోనే జనాభా కొంత తక్కువ పెరిగిందన్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కూడా పెద్ద ప్రాబ్లం లేదని, ఇవన్నీ కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు.. చిన్న సమస్యను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు.
డీలిమిటేషన్ సమావేశం కాదు.. చంబల్ లోయ ముఠా మీటింగ్
ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్ అంశంపై డీఎంకే మీటింగ్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం స్పందించారు. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం అని విమర్శించారు. అది డీలిమిటేషన్ సమావేశం కాదు.. చంబల్ లోయ ముఠా సమావేశం అని తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందని, అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని, ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందని, కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందని అన్నారు.
6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయ్ అని, లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారని విమర్శించారు. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుంచి బయటపడే దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ పై ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదన్నారు. ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుందన్నారు.