- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delimitation Meeting: CM రేవంత్ ప్రతిపాదనకు తమిళ CM స్టాలిన్ అంగీకారం

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Tamil CM Stalin) నేతృత్వంలో చెన్నై వేదికగా జరుగుతోన్న డీలిమిటేషన్ సమావేశం(Delimitation Meeting)లో కీలక నిర్మాణాలు చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణలోనూ సమావేశం పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపాదించారు. రేవంత్ ప్రతిపాదనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంగీకారం తెలిపారు. అంతకుముందు స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని అన్నారు. ప్రస్తుతమున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగనివ్వకూడదని అన్నారు. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం పడిపోతే.. అభిప్రాయాలను కూడా చెప్పలేని పరిస్థితులు వస్తాయని అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. అలా జరిగితే అది మనకు డేంజర్ బెల్ లాంటిదే అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు పాల్గొన్నారు.
డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరుగబోతోంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ అవుతారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో తేదీలు ఖరారు చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.