దోషులకు శిక్ష పడేలా చూడాలి

by Sridhar Babu |
దోషులకు శిక్ష పడేలా చూడాలి
X

దిశ, గోదావరిఖని : నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్​ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్‌ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరస్తులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టాలన్నారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెదలాలి అని అన్నారు. దోషులకు శిక్ష పడడంతో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత చాలా కీలకమైదని, నేరస్తులకు వారెంట్స్‌, సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్‌ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్‌ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్‌ఎస్‌లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే బాధితులకు మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ(అడ్మిన్‌) రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లా రెడ్డి, లీగల్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, సీసీఆర్‌బీసీ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సీసీ హరీష్ తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed