4 వేల కోట్లు లాభాలు వస్తే.. 2 వేల కోట్లు పంచుతున్నాం: జనక్ ప్రసాద్

by Mahesh |
4 వేల కోట్లు లాభాలు వస్తే.. 2 వేల కోట్లు పంచుతున్నాం: జనక్ ప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో రూ. 4 వేల కోట్లు లాభాలు వస్తే, రూ. 2 వేల కోట్లను కార్మికులకు పంచుతున్నామని మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న సింగరేణి లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల రూపాయలు బోనస్ ను అందిస్తున్నామన్నారు. 130 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారన్నారు. 2014 లో కేవలం 13, 751 బోనస్ ఇచ్చి, ఆ తర్వాత లెక్కలన్నీ గోప్యంగా ఉంచుతూ బీఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందన్నారు. లాభాలు వివరాలు ప్రకటించలేదన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ఎలాంటి దాపరికం లేదని, వచ్చిన లాభాల్లో కార్మికుడిని బతికిస్తామని నొక్కి చెప్పారు.

Next Story

Most Viewed