- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
' హాయ్ నాన్న ' స్టోరీ రిపీట్... భర్తనే మళ్లీ ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి..
దిశ, ఫీచర్స్ : 'హాయ్ నాన్న ' సినిమా చూసారా? ఈ మూవీలో నాని, మృణాల్ ముందు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వీరికి పుట్టిన బిడ్డ ఎక్కువ కాలం బతకదని డాక్టర్ చెప్పడంతో హీరోయిన్ ఏడుస్తుంది. ఇదంతా హీరో వల్లనే జరిగిందని కుమిలిపోతుంది. ఈ క్రమంలో హాస్పిటల్ నుంచి వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే ఆమె గతం మరిచిపోతుంది. తనకు ఎలాగూ ఈ లైఫ్ ఇష్టం లేదని.. తల్లి ఆమె పెళ్లి కాలేదన్నట్లుగానే లైఫ్ కంటిన్యూ చేసేలా చేస్తుంది. హీరో కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. కానీ ఆ అమ్మాయి మళ్లీ వచ్చి తననే ప్రేమిస్తుంది. అంతే తన భర్తనే మళ్లీ లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇందుకోసం తన పాపకు దగ్గరవుతుంది. కానీ ఆమె తన పాప అని కూడా తెలియదు.
అయితే ఇలాంటి స్టోరీనే రియల్ లైఫ్ లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లారా, బ్రేడెన్ ఇద్దరు కలిసిన కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడిపోయారు. అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. కానీ తొమ్మిది నెలల్లోనే ఆ హ్యాపీనెస్ కు ఎండ్ కార్డ్ వేస్తూ.. యాక్సిడెంట్ జరిగింది. ఇందులో లారా పూర్తిగా తన గతాన్ని మరిచిపోయింది. భర్త కాస్త అపరిచితుడు అయిపోయాడు. కానీ ఆయన మాత్రం తననే ప్రేమించాడు. మళ్లీ తనను ప్రేమించేలా చేసేందుకు రెండేళ్లు కష్టపడ్డాడు. తాము తిరిగిన ప్రతి చోటుకు తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ లలోనే డేటింగ్ ప్లాన్ చేస్తూ వచ్చాడు. మొత్తానికి లారా తనకు పడిపోయింది. మళ్ళీ తనను పెళ్లి చేసుకుంది.