అభం శుభం తెలియని విద్యార్థినిలపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు

by Mahesh |
అభం శుభం తెలియని విద్యార్థినిలపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు
X

దిశ, మంత్రాలయం రూరల్: కర్నూలు జిల్లా పెద్దకడబూరు లో దారుణం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ అభం శుభం తెలియని విద్యార్థినిలపై వికృత చేష్టలు చేస్తూ గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులకు సెల్ ఫోన్‌లో అసభ్య ఫొటోలు చూపిస్తూ శరీరంపై చేతులతో ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినులు వాష్ రూంలోకి వెళ్లితే హెడ్‌మాస్టర్ కూడ అందులోకి వచ్చి నిలబడి ఉండేవాడు. ఇలా నిత్యం భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తున్నారు. విద్యార్థినిల బాత్ రూం కు డోర్ తొలగించి సెల్ ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని.. ప్రధానోపాధ్యాయులు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చి పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకోగా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పితే టీసి ఇచ్చి బయటకు పంపిస్తానని బెదిరించాడని విద్యార్థినులు ఆరోపించారు.

మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 1వ తరగతి నుండి ఐదో తరగతి వరకు సుమారు 140 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక టీసీలు తీసుకొని ప్రైవేటు స్కూల్‌లో చేరుతున్నారు. హెడ్ మాస్టర్ సుప్రసాద్ పెద్దకడుబూరులో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నారు. గతంలో కూడా దొడ్డి మేకల గ్రామంలో పనిచేస్తున్న సమయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలును స్కూల్‌కు పంపాలంటే భయ పడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ విద్యార్థి తల్లిదండ్రులు గొడవ పడి టీసీ తీసుకొని వెళ్లారు. విద్యార్థులు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన బాగోతం బయటకు పొక్కిందని తెలిసి ప్రధానోపాధ్యాయులు 10 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు సమాచారం. ప్రధానోపాధ్యాయులు సుప్రసాద్ ఎమ్మిగనూరు ఓ చర్చిలో సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story

Most Viewed