GST Officers: దేశవ్యాప్తంగా 10,700 బోగస్ సంస్థలను గుర్తించిన జీఎస్టీ అధికారులు

by S Gopi |
GST Officers: దేశవ్యాప్తంగా 10,700 బోగస్ సంస్థలను గుర్తించిన జీఎస్టీ అధికారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాను మోసగిస్తూ ఏర్పాటైన నకిలీ కంపెనీలపై జరుగుతున్న డ్రైవ్‌లో జీఎస్టీ అధికారులు భారీ మొత్తం ఎగవేతలను గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ. 10,179 కోట్ల జీఎస్టీ చెల్లింపులను ఎగొట్టిన 10,700 నకిలీ రిజిస్ట్రేషన్‌లను పట్టుకున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్(సీబీఐసీ) సభ్యుడు శశాంక్ ప్రియా మాట్లాడుతూ.. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ల ఆధార్ ధృవీకరణ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అమలవుతోందని, అక్టోబర్ 4 నాటికి మరో నాలుగు రాష్ట్రాలు ఈ జాబితాలో చేరుతాయని ఆయన చెప్పారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేసే ప్రభుత్వ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, మరింత సమగ్రంగా వెరిఫికేషన్ జరుగుతోందని తెలిపారు. నకిలీ రిజిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా రెండవ ఆల్ ఇండియా డ్రైవ్ ఆగస్టు 16న ప్రారంభమైంది. అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. పన్ను అధికారులు 67,970 జీఎస్టీఐఎన్‌లను గుర్తించారని ఆయన చెప్పారు. ఇందులో 59 శాతం జీఎస్‌టీఐఎన్‌లు (39,965) సెప్టెంబర్ 22 నాటికి ధృవీకరించబడ్డాయన్నారు. గతేడాది మొదటి స్పెషల్ డ్రైవ్‌లో రూ. 24,010 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story