FULL RAINS : దక్షిణాదికి భారీ వర్షసూచన : ఐఎండీ

by saikumar |
FULL RAINS : దక్షిణాదికి భారీ వర్షసూచన : ఐఎండీ
X

దిశ,నేషనల్ బ్యూరో : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య దిశలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం తీరం దాటే క్రమంలో ఉత్తర భారతదేశం మీదుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది.

సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనగా.. దక్షిణ తమిళనాడు మీదుగా పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం సైతం ఉందని ఐఎండీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed