Good News: హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త..ఇక నుంచి రాత్రి ఒంటిగంట వరకు హోటల్స్,రెస్టారెంట్స్ ఓపెన్..!

by Maddikunta Saikiran |
Good News: హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త..ఇక నుంచి రాత్రి ఒంటిగంట వరకు హోటల్స్,రెస్టారెంట్స్ ఓపెన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు తీపి కబురు చెప్పింది.హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ (Hyderabad,Rachakonda,Cyberabad) పరిధిలో ఉన్న హోటల్స్(Hotels),రెస్టారెంట్స్(Restaurants),ఐస్ క్రీం(Ice Cream),పాన్ దుకాణాలు(Pan Shops) అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకునేందుకు పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్(Hyderabad CP) సీవీ ఆనంద్(CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు.ఫుడ్ స్టాల్స్(Food Stalls) ఉదయం 5 నుంచి రాత్రి 1 వరకు, క్లాత్స్(Clothes),సూపర్ మార్కెట్స్(Super Markets),కిరాణా దుకాణాల(Grocery stores)కు ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అలాగే మద్యం దుకాణాల(Wines Shops)కు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు,బార్లు(Bars) వీక్ డేస్ లో ఉదయం ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు, వీకెండ్స్ లో ఉదయం 10 నుంచి రాత్రి 1 వరకు అనుమతిస్తున్నట్లు(Permission) ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed