BCCI: నేడే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ..పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

by Maddikunta Saikiran |
BCCI: నేడే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ..పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్:బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్(BCCI Apex Council) సమావేశం నేడు (సెప్టెంబర్ 25న) జరగనుంది.ఐసిసి(ICC) కొత్త ఛైర్మన్‌(Chairman)గా BCCI సెక్రటరీ జై షా(Jay Shah) ఎన్నికైన తరుణంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పని సరి కానుంది.దీంతో బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు BCCI ఈ భేటీ నిర్వహించనుంది. కొత్త కార్యదర్శి నియామకం కోసం నామినేషన్ ప్రక్రియ మినహా ఎనిమిది అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.ముఖ్యంగా BCCI యొక్క మాజీ టైటిల్ స్పాన్సర్ (Former Title Sponsor), బైజూస్(BYJU'S) కు సంబంధించి బకాయిలు(Payments) సెటిల్ చేసుకోవడం. BCCI, 2019లో బైజూస్ తో స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకోగా, ఆ ఒప్పందం 2023 మార్చిలో ముగిసింది.కానీ బైజూస్ సెప్టెంబర్ 2022 వరకే స్పాన్సర్‌షిప్ చెల్లింపులు చేసింది.అక్టోబర్ 2022 నుండి మార్చి 2023 వరకు బైజూస్ బకాయిలు చెల్లించలేదు.దీంతో బకాయిలను రాబట్టేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరగనుంది. అలాగే 2023 మార్చిలో బెంగళూరు(Bengaluru) శివార్లలో కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) ప్రారంభోత్సవంపైనా, ముంబై(Mumbai)లోని BCCI ప్రధాన కార్యాలయం రెన్నొవేషన్(Rennovation) పైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Next Story

Most Viewed