జుట్టు తెల్లబకుండా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి...

by Sujitha Rachapalli |
జుట్టు తెల్లబకుండా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి...
X

దిశ, ఫీచర్స్ : తెల్లజుట్టు సాధారణం అయిపోయింది. ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది. దీనికి కారణం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, డైట్ పాటించకపోవడం, సరైన లైఫ్ స్టైల్ మెయింటెయిన్ చేయకపోవడం, కాలుష్యం వంటి చాలా కారణాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఎర్లీగా గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలో సూచిస్తున్నారు.

కెఫిన్

అధిక కెఫిన్ వినియోగం ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. త్వరగా తెల్లబడటానికి దారితీస్తుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్ విటమిన్ బి, జింక్, కాపర్ స్థాయిలను తొలగిస్తుంది. ఇవన్నీ హెయిర్ కలర్ మేనేజ్మెంట్ లో కీలకం కాగా జుట్టు నెరవకుండా నివారించడానికి ముఖ్యమైనవి.

షుగరీ ఫుడ్స్

అధిక చక్కెర కొల్లాజెన్‌ను దెబ్బతీస్తుంది, న్యూట్రీషనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా బలహీనమైన జుట్టు, ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ కి దారితీస్తుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్

చక్కెర, రసాయనాలతో నిండిన కార్బోనేటేడ్ డ్రింక్స్... జుట్టు పిగ్మెంటేషన్‌ను నిర్వహించడానికి అవసరమైన పోషకాలను క్షీణింపజేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పురుషుల్లో బట్టతలకు ఈ పానీయాలు కారణమని అధ్యయనాలు కూడా నిరూపించాయి.

ఫ్రైడ్ ఫుడ్స్

వేయించిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి. వాపుకు కారణమవుతాయి. జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్

అధికంగా ప్రాసెస్ చేయబడిన స్నాక్స్ చిప్స్, క్రాకర్స్ పోషకాలను కలిగి ఉండవు. వీటివల్ల విటమిన్ లోపం తలెత్తుతుంది. తద్వారా చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు దారితీస్తుంది.

రిఫైండ్ కార్బోహైడ్రేట్స్

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉదాహరణకు రిఫైండ్ వైట్ బ్రెడ్, పాస్తా, బియ్యంలో పోషకాలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నెరిసేందుకు కారణమవుతుంది.

జంక్ ఫుడ్

అనారోగ్యకరమైన కొవ్వులు, తక్కువ పోషకాలు, జంక్ ఫుడ్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యం, రంగును ప్రభావితం చేస్తుంది.

మితిమీరిన ఉప్పు

అధిక ఉప్పు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. పోషకాల శోషణను పరిమితం చేస్తుంది, తెల్ల జుట్టు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed