Exports: ఎగుమతి ప్రోత్సాహక పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరిన అపెక్స్ బాడీ

by S Gopi |
Exports: ఎగుమతి ప్రోత్సాహక పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరిన అపెక్స్ బాడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఆగష్టులో సరుకుల ఎగుమతులు 13 నెలల కనిష్టంతో 9.3 శాతానికి పరిమితమైన నేపథ్యంలో ఎగుమతిదారుల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ) ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన పంపింది. ఎగుమతుల రంగానికి క్రెడిట్ సౌకర్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఎగుమతి ప్రోత్సాహక పథకం కింద ప్రయోజనాలను ఐదేళ్లపాటు పొడిగించాలని కోరింది. దేశ ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం షిప్‌మెంట్‌కు ముందు తర్వాత రూపాయి ఎగుమతి క్రెడిట్‌పై వడ్డీ సమీకరణ పథకాన్ని మరో నెల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ పథకం కొన్ని రంగాల ఎగుమతిదారులకు, అన్ని ఎంఎస్ఎంఈ తయారీదారులు-ఎగుమతిదారులకు పోటీ ధరలకు రూపాయి ఎగుమతి క్రెడిట్‌ను పొందేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదురుగాలిని ఎదుర్కొంటున్న సమయంలో ఈ క్రెడిట్ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతోంది. 'ఈ పథకం సెప్టెంబరు 30తో ముగుస్తుంది. దీనిని ఐదేళ్ల పాటు పొడిగించాలని మేము అభ్యర్థించాము. వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ లేకపోతే, కొన్ని మార్కెట్‌లను, ఆర్డర్‌లను కోల్పోయే అవకాశం ఉంది' అని ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు.

Advertisement

Next Story