- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
PM Modi : ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ..
దిశ, నేషనల్ బ్యూరో : మూడ్రోజుల అమెరికా పర్యటన అనంతరం ప్రధాని ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఆయన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయ్యింది. అమెరికా పర్యటనలో మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం డెలావేర్‌లో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లోనూ ఆయన ప్రసంగించారు. క్వాడ్ సభ్యదేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
ఆ తర్వాత ప్రవాస భారతీయులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, అమెరికాలోని 15 ముఖ్యమైన కంపెనీల సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిపారు. మోడీ ఇండియాకు తిరుగుపయనం అయ్యే ముందు సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో తన అమెరికా పర్యటన ఎలా సాగిందనే దానిపై ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఇది ఫలవంతమైన అమెరికా పర్యటన. విభిన్న కార్యక్రమాల్లో పాల్గొని మన భూగ్రహాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అనేక విషయాలపై దృష్టి సారించాం. జో బైడెన్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించారు. బైడెన్ డెలావేర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. అతని అనుబంధం, ఆప్యాయత నా హృదయాన్ని హత్తుకున్నాయి’ అంటూ ఇద్దరు అగ్రనేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, కరచాలనం చేస్తున్న వీడియోను మోడీ పోస్టు చేశారు.