- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనలో భయాన్ని కూడా గౌరవించాలి!
కమర్షియల్ విలువలతో పాటు సామాజిక కోణాన్ని జోడిస్తూ సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబరు 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివతో ఇంటర్వ్యూ ఇది.
సినిమా ఫలితం పట్ల కాన్పిడెంట్‌గా వున్నరా?
ఎగ్జామ్ రాసిన తర్వాత ఫలితం కోసం ఎదురుచూసేటప్పుడు ఉండే ఎగ్జయిట్‌మెంటో, నెర్వస్‌నెస్ ఏదైనా అనుకోవచ్చు.. మనసులో అలా ఉంది. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందే ఉండేదే. కానీ సినిమా విజయం పట్ల నమ్మకంతో వున్నాను. టీమ్ అందరం ఎన్టీఆర్‌గారి కోసం చివరి నిమిషం వరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టేశాం. ఇక రిజల్ట్ అదెప్పుడూ మన చేతిలో ఉండదు.
దేవర ఎలాంటి కథ?
‘దేవర’ మూవీ కథ అంతా పిక్షనల్. ఎక్కడా నిజ ఘటనలను ఆధారంగా తయారు చేసుకున్న కథ కాదు. మనిషికి మితిమీరిన ధైర్యం కూడా కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండానే మనలో ఓ భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెప్పటమే ‘దేవర’ కథ.
దేవర కథ వినగానే ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా వుంది?
ఎన్టీఆర్‌తో నా ప్రయాణం ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. ఏ విషయం అయినా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బాగున్నా, బాగోలేకపోయినా రియాక్షన్ చాలా ముక్కసూటిగా వుంటుంది. ఓపెన్‌గా మనసులో ఉన్న భావాన్ని చెబుతారు. ‘దేవర’ లైన్ చెప్పినప్పుడు ఆయన స్పందించిన తీరుతోనో నాలో సినిమా విజయంపై విశ్వాసం పెరిగింది.
ఆచార్య ఫలితాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు?
‘ఆచార్య’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే సినిమా విడుదల కాగానే నేను దేవర సినిమా వర్క్‌లో వుండిపోయాను.ఆచార్య రిలీజైన మొదటివారంలోనే దేవర సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడ్డాను.
దేవర రెండో పార్ట్ చేయాలనే ఆలోచన ముందు నుంచే వుందా?
‘దేవర’ సెకండ్ షెడ్యూల్ సమయంలో రెండో పార్ట్‌ను చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం సాధ్యమయ్యే పని కాదని తెలిసిపోయింది. అంతే తప్ప ఇదేదో బిజినెస్ కోసమో, సెన్సేషన్ కోసమో రెండో పార్ట్‌ని అనౌన్స్ చేయలేదు.
ఈ కథను ఎన్టీఆర్ కోసమే తయారుచేశారా?
‘దేవర’.. అంటే ఎన్టీఆర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. ఆయనే హీరో.. అలాంటప్పుడు ఆ పాత్రలో ఎన్టీఆర్‌గారిని కాకుండా మరొకరిని ఎలా అనుకుంటాను. కథ రాసుకునేటప్పుడే రెండు పాత్రలకు ఎన్టీఆర్‌గారిని అనుకునే రాసుకున్నాను. దేవర కొడుకు వర.. పాత్ర ఆయన్ని మించేలా ఉంటుంది. దేవర రెండు భాగాల్లోనే పూర్తయ్యే సినిమా.
ఆచార్య ఫలితం తరువాత చిరంజీవితో మీ రిలేషన్ ఎలా వుంది?
నాకు, చిరంజీవిగారికి ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది.. ఉంటుంది. ఆచార్య తర్వాత ఈసారి నువ్వు ఇంకా గట్టిగా హిట్ కొడతావంటూ మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి ఆయన. అలాంటి నాకు, ఆయన మధ్య తేడాలెందుకుంటాయి.
హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర ఎలా వుంటుంది?
జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె అని కానీ.. ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా నేర్చుకుని మరీ చేసింది. దేవర సినిమాలో మనిషిలో భయం ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆ భయాన్ని నేను జాన్వీలో చూశాను. వారం, పది రోజుల ముందు నుండే సీన్ పేపర్ కావాలని నన్ను అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది. ఫస్ట్ డే షూటింగ్‌లో ఆమె నటించిన సీన్ కాగానే తారక్‌గారు ఫెంటాస్టిక్ అంటూ చేయి చూపించారు.
మీ తదుపరి చిత్రం?
దేవర సినిమా మీదనే ఫోకస్‌గా ఉన్నాం.. నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇంకా ఆలోచించలేదు.