- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG ICET: ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్(ICET) తుది విడత(Final allotment) సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 87.5 శాతం, ఎంబీఏలో 90.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తంగా 90.2 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కలిపి మొత్తం 35,311 సీట్లు ఉండగా.. 31,842 సీట్లు అలాట్(Allotted) అయ్యాయి. ఇక 3,469 సీట్లు మాత్రమే మిగిలాయి. 99 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. ఫీజు చెల్లించిన వారంతా ఈ నెల 28 వ తేదీలోపు విద్యార్హత సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో ఆటోమేటిక్‌గా సీటు క్యాన్సిల్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://tgicet.nic.in లాగిన్ అవ్వొచ్చు.