- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sriram Sagar Project : శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద
దిశ, బాల్కొండ : నిర్మల్ జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి భారీ వరద వచ్చి చేరుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి 41 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు. మంగళవారం తెల్లవారు జాము నుండి క్రమంగా వరద పెరుగుతుండటంతో ఉదయం 4 గంటలకు 4 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 11 గంటలకు 41 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వరద కాలువకు 10 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు ఉన్న గేట్ల నుండి గోదావరిలోకి 1200 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా మంగళవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 190 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ఏఈఈ తెలిపారు. 117 టీఎంసీల మిగులు జలాలను గోదావరిలోకి వదులుతున్నట్టు చెప్పారు.
- Tags
- SRSP