- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
ఈ వింత పోటీల్లో గెలిస్తే రూ.లక్ష బహుమతి మీదే!
దిశ, వెబ్ డెస్క్ : రూ.లక్ష బహుమతి పొందే పోటీ ఏంటి అనుకుంటున్నారా..? పాములు పట్టే పోటీ. అవును మీరు విన్నది నిజమే. ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ ఏటా ఆగస్టులో 'ఫ్లోరిడా పైతాన్ ఛాలెంజ్' పేరిట పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 9న ఈ పోటీలు ప్రారంభం అయ్యి, ఆగస్టు 18న ముగుస్తాయి.
అసలెందుకు ఈ పోటీలు..!!
2000 సంవత్సరంలో ఎవర్ గ్లెడ్స్ నేషనల్ పార్కులో వీటిని మొదటిసారి గుర్తించారు. ఇవి ఏకది నుండి ఈ పార్కుకు చేరాయో తెలియదు కానీ అప్పటి నుండి వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. వీటి సంఖ్య తగ్గించడంలో భాగంగానే ప్రతి ఏడూ ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ పైతాన్ లను హింసించకుండా చంపడం పోటీలో భాగం. వీటిని ఎలా చంపాలి అనే దాని మీద శిక్షణ కూడా ఇస్తారు నిర్వాహకులు. ఎవరైతే అతి పొడవైన, పెద్ద పామును పట్టుకుంటారో వారే విజేతలన్నమాట. అనుభవం ఉన్నవారు, అనుభవం లేనివారు, మిలటరీ నిపుణులు అనే మూడు కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. గతేడాది ఈ పోటీల్లో 209 పైతాన్లను చంపివేశారు. అయితే ఈ పోటీల్లో స్థానిక పాములను కూడా చంపే అవకాశం ఉంటుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో.. మీరు ఎపుడైనా ఆగస్టులో ఫ్లోరిడా వెళితే ఈ పోటీల్లో పాల్గొని పెద్ద పామును పట్టుకొని లక్ష రూపాయల బహుమతి కొట్టేయండి మరి.