- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేసవిలో 243 మిలియన్లకు పైగా పిల్లలపై వేడి గాలుల ఎఫెక్ట్: UN హెచ్చరిక
దిశ, నేషనల్ బ్యూరో: ఆసియా అంతటా విపరీతమైన వేడి వలన చాలా మంది ప్రజలపై వేడిగాలులు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ పేర్కొంది. ముఖ్యంగా తూర్పు ఆసియా, పసిఫిక్ అంతటా 243 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు వేడి-సంబంధిత అనారోగ్య సమస్యలు, మరణాల ప్రమాదంలో ఉన్నారని, ఈ ప్రాంతంలో రాబోయే నెలల్లో రికార్డు స్థాయిలో వేడి పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడిగాలులు ఆందోళన కలిగిస్తుంది. అధిక తేమ స్థాయిలు శరీరం సహజంగా చల్లబడటాన్ని మరింత కష్టతరం చేస్తాయని UN హెచ్చరించింది.
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ప్రకారం, పెద్దవారితో పోలిస్తే పిల్లలు వేడి గాలులకు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఉష్ణోగ్రతను తక్కువగా నియంత్రించగలుగుతారు. అధిక వేడి కారణంగా పిల్లలు దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు, ఉబ్బసం, హృదయ సంబంధ వ్యాధుల వంటి వేడి-సంబంధిత వ్యాధులకు గురవుతారు. వాతావరణ మార్పుల ప్రభావాలకు పెద్దల కంటే పిల్లలకే ఎక్కువ హాని కలుగుతుందని, అధిక వేడి వారికి ప్రాణాంతక ముప్పుగా మారిందని యునిసెఫ్ తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ డెబోరా కొమిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో 2024 దేశంలోని అత్యంత వేడి సంవత్సరాలలో ఒకటిగా ఉండవచ్చని పేర్కొంది. యునిసెఫ్ అంచనాల ప్రకారం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కారణంగా 2050 నాటికి ప్రపంచంలోని రెండు బిలియన్ల పిల్లలందరూ ఉష్ణోగ్రతల మార్పుల పరంగా తీవ్ర ప్రభావానికి లోనవుతారని తెలిపింది.