రూ.4 వేల విరాళం.. 12 ఏళ్ల జైలు శిక్ష

by M.Rajitha |
రూ.4 వేల విరాళం.. 12 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : కేవలం 51 డాలర్లు(రూ.4200) విరాళం ఇచ్చినందుకు ఓ మహిళకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన సేనియా ఖవావా ఓ డాన్సర్. అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు కొంతకాలం క్రితం స్వస్థలానికి వచ్చింది. అయితే, ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో కోసం సేనియా విరాళాలు సేకరిస్తున్నట్టు రష్యా అధికారులు గుర్తించి, అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. సేనియా 51 డాలర్ల నగదును ఆ స్వచ్చంద సంస్థకు బదిలీ చేసినట్టు అంగీకరించింది. అయితే అవి రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారని తనకు తెలియదని కోర్టు ముందు వాపోయింది. పోలీసులు మాత్రం దేశ ద్రోహం కింద అభియోగాలు మోపగా.. విచారణలో దోషిగా తేలింది. దీంతో రష్యా కోర్ట్ ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉక్రెయిన్ మీద దురాక్రమణ కొనసాగిస్తున్న రష్యా.. శత్రుదేశానికి మద్దతుగా నిలిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది అనేందుకు ఇదే పెద్ద సాక్ష్యం.

Next Story

Most Viewed