అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆయనదే విజయం..

by Vinod kumar |
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆయనదే విజయం..
X

వాషింగ్టన్ : అమెరికాలో ఇప్పటికిప్పుడు అధ్యక్ష ఎన్నికలు జరిగితే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత 77 ఏళ్ళ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గెలుస్తారని తాజా సర్వేలో తేలింది. ట్రంప్‌కు 52 శాతం ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడైంది. 45 నుంచి 40 శాతం ఓట్ల తేడాతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓడిస్తారని సర్వేలో గుర్తించారు. “హార్వర్డ్ హారిస్ పోల్” సంస్థ జూలై 19, 20 తేదీలలో 2,068 ఓటర్లను సర్వే చేసి ఈ అంచనా ఫలితాలను విడుదల చేసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆయనదే విజయం..ఈ సర్వేలో ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కమలా హారిస్ కంటే ట్రంప్‌కు 47 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 16% మంది ఓటర్లు ఓటు ట్రంప్ కు వేయాలా..? బైడెన్‌కు వేయాలా..? అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని తెలిపారు. ఈ సర్వే నివేదిక ప్రకారం దేశ అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలో ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత రాన్ డిసాంటిస్ నిలిచారు.

ఈయన 12 శాతం ఓట్లు పొందారు. ఇక మూడో ప్లేస్‌లో నిలిచిన భారత సంతతి వ్యాపార దిగ్గజం, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ గణపతి రామస్వామికి మద్దతు తెలుపుతామని సర్వేలో పాల్గొన్న 10 శాతం మంది ఓటర్లు చెప్పారు. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ప్రకటించకపోతే.. రాన్ డిసాంటిస్ కే ఆ ఛాన్స్ దక్కొచ్చని సర్వేలో తేలింది. ఇప్పటికే 80 ఏళ్ళ ఏజ్‌కు చేరిన ప్రెసిడెంట్ బైడెన్‌కు అధ్యక్ష పదవిని, అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed