- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kejriwal : రిమోట్ కంట్రోల్ టాయిలెట్.. కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో : ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అధికారిక నివాసంలో లగ్జరీ జీవితాన్ని గడిపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లను కేజ్రీవాల్ ఏర్పాటు చేయించుకున్నారని మండిపడ్డారు. ఆ టాయిలెట్లలో వాటర్ ప్రెషర్, నీటి టెంపరేచర్ స్థాయి, సీటులో ఉండాల్సిన ఉష్ణోగ్రత వంటివన్నీ రిమోట్ కంట్రోల్‌తో సెట్ చేయొచ్చని సంబిత్ పాత్ర తెలిపారు.
‘‘ఢిల్లీ సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన టైంలో టోటో కంపెనీకి చెందిన స్మార్ట్ కమోడ్‌ను అరవింద్ కేజ్రీవాల్ తీసుకెళ్లిపోయారు’’ అని ఆయన ఆరోపించారు. వెంటనే దాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆప్ అధినేతను డిమాండ్ చేశారు. ‘‘కేజ్రీవాల్.. ప్రస్తుతానికి స్మార్ట్ టాయిలెట్ రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరే రాజు. కానీ ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత.. రిమోట్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కేజ్రీవాల్‌ను ప్రజలు పెనంపై కూర్చోబెట్టడం ఖాయం’’ అని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.