Indel Money: ఐదవ పబ్లిక్ ఇష్యూని ప్రకటించిన ఇండెల్‌ మనీ.. రూ.150 కోట్ల ఎన్‌సిడిల జారీ..!

by Maddikunta Saikiran |
Indel Money: ఐదవ పబ్లిక్ ఇష్యూని ప్రకటించిన ఇండెల్‌ మనీ.. రూ.150 కోట్ల ఎన్‌సిడిల జారీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ లోన్(Gold Loan) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC) ఇండెల్‌ మనీ(Indel Money) సోమవారం తన ఐదవ పబ్లిక్ ఇష్యూని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్థి కోసం నాన్‌ కన్వర్టేబుల్‌ డిబెంచర్ల(NCD)లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో రూ.150 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 4 వరకు ఈ ఇష్యూ తెరిచి ఉంటుందని తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను తదుపరి రుణాలు, ఫైనాన్సింగ్, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వదుకుంటామని ఇండెల్‌ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒ ఉమేష్ మోహనన్(Executive Director, CEO Umesh Mohanan) వెల్లడించారు. జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో తమ పోర్టుపోలియోలో రూ. 91,481.95 లక్షల విలువైన పసిడి రుణాలున్నాయని తెలిపింది. కాగా ఈ సంస్థ 1986లో స్థాపించబడింది. ఆగస్టు 31, 2024 నాటికి, కంపెనీలో మొత్తం 1731 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీకి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో బ్రాంచ్ లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed